Ration Dealer Murdered | Peddapalli Dist In Manthani | మంథనిలో రేషన్‌ డీలర్‌ను హత్య చేసిన ఆటోడ్రైవర్

Описание к видео Ration Dealer Murdered | Peddapalli Dist In Manthani | మంథనిలో రేషన్‌ డీలర్‌ను హత్య చేసిన ఆటోడ్రైవర్

పెద్దపల్లి జిల్లా మంథనిలో రేషన్ డీలర్ హత్యోదంతం కలకలంరేపింది. రెండ్రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ గా ఉన్న వ్యక్తి గతంలో చనిపోగా... తన భార్య రాజమణి డీలర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. సోమవారం సరుకుల కోసం మంథనికి వెళ్లిన రాజమణి తిరిగి రాలేదు. పిల్లలు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే మంథనిలో సంతోష్ అనే వ్యక్తి అద్దెకుండే ఇంట్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చనిపోయిన మహిళ రాజమణిగా నిర్ధారించారు. సోమవారం రాత్రి గొంతు కోసి, రాజమణిని దారుణంగా హతమార్చినట్లు గుర్తించారు. ఆటోడ్రైవర్ గా పనిచేస్తున్న సంతోష్.... రేషన్ డీలర్ రాజమణికి సరుకులు రవాణా చేస్తుంటాడని... ఈ సమయంలో వీరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. సంతోష్ వేధింపులతో ఆమె కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మహిళను దారుణంగా హతమార్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు సంతోష్ ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమణి మృతితో ఆమె పిల్లలు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడిపెట్టించింది
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке