నాగార్జున సాగర్ గొప్పదా..? పోలవరం గొప్పదా? ... చూద్దాం రండి

Описание к видео నాగార్జున సాగర్ గొప్పదా..? పోలవరం గొప్పదా? ... చూద్దాం రండి

నాగార్జున సాగర్ గొప్పదా..? పోలవరం గొప్పదా? ... చూద్దాం రండి
#polavaram #polavaramproject #aplifeline #polavaramupdates #LifelineOfAndhraPradesh

దేశంలో తాగు, సాగు నీటి అవసరాల కోసం, జలవిద్యుత్ కోసం జలాశయాలు నిర్మించారు. ముఖ్యంగా వీటి నిర్మాణం స్వతంత్రం సిద్దించాక ప్రణాళికాబద్ధంగా మొదలు పెట్టారు.

ప్రాజెక్ట్ ల నిర్మాణంలో చెప్పుకోదగ్గవి ఎన్నో ఉన్నా.. మధ్యప్రదేశ్ లోని ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ కే అగ్రస్థానం. ఇక రెండవ స్థానంలో మనం ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య వున్న నాగార్జున సాగర్ రికార్డు కెక్కింది.

ఈ జలాశయం 70 వేల ఎకరాల్లో విస్తరించి 312 టీఎంసీల నీటిని నిల్వ చేయగలుగుతుంది. కృష్ణ నదిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1950 దశకంలో నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అప్పటికి, ఇప్పటికీ.. తన ప్రత్యేకతను చాటుకుంటూనే వుంది. ఈ ప్రాజెక్ట్ ను తలదన్నే ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశంలో మరొకటి లేదంటే.. దీని గొప్పతనం స్పష్టంగా అర్ధమవుతోంది. నాగార్జున సాగర్ ను ఎర్త్ డాం తో పాటు masenry నిర్మాణం గ ప్రసిద్ధికెక్కింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో వేల మంది కార్మికులు చెమటోడ్చి ఈ ప్రాజెక్ట్ ను 12 ఏళ్లపాటు నిర్మించి చరిత్రకెక్కారు.

179 మీటర్ల ఎత్తులో అంటే.. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగలిగే ఈ జలాశయంలో నికరంగా 312 టీఎంసీలు నీరు ఉంటుంది. శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, తుంగభద్ర జలాశయాలన్నీ కలిపితే ఎంత నీరు ఉంటుందో దాదాపు అంత నీరు ఈ సాగర్లో ఉంటుంది. దీన్ని బట్టి ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పదో అర్ధమైపోతుంది. ఇందులో masonry డాం లో స్పిల్వే 471 మీటర్లు అంటే.. దాదాపు అరకిలోమీటరు ఉంటుంది. ఇక్కడి నుంచే నీరు కిందకు ప్రవహిస్తుంది.

ఇది కాకుండా non-overflow dam అంటే.. నీరు ప్రవహించని ప్రాంతం 979 మీటర్లు.. మనభాషలో ఒక కిలోమీటరు తో సమానం. ఇది కాకుండా రెండు వైపులా కలిపి ఎర్త్ డాం 3414 మీటర్లు నిర్మించారు. అంటే.. దాదాపు మూడున్నర కిలోమీటర్లు. ఇంత పెద్ద ఎర్త్ డాం ఉన్న భారీ జలాశయం మరోటి లేదు. ఇక్కడ జల విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు. మొత్తం 8 యూనిట్ల ద్వారా 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో నల్గొండ, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఈ ప్రాజెక్ట్ వల్ల సస్యశ్యామలం అయ్యాయి. అదే సమయంలో గ్రామాల తాగునీటి అవసరాలు తీర్చటంతో పాటు హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందిస్తోంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ తాగునీటి అవసరాలకోసం నిర్మిస్తున్న సుంకిశాలకు కూడా ఈ ప్రాజెక్ట్ నుంచే నీటిని తీసుకుంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ప్రాజెక్ట్ కృష్ణ నదికి వచ్చే వరదను కూడా అదుపు చేస్తుంది.

ఇప్పుడు తాజాగా గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం జలాశయంతో పోలిస్తే సాగర్ పెద్దదా? లేక సాగర్ కన్నా నిర్మాణం పూర్తి అయ్యాక పోలవరమే పెద్దది అవుతుందా? రెండింటిలో గొప్పది ఏది?

నిజానికి సాగునీటి ప్రాజెక్టులను ఒకదానితో మరొకదాన్ని పోల్చకూడదు. ఏ ప్రాజెక్ట్ విశిష్టతలు ఆ ప్రాజెక్ట్ కి ఉంటాయి. అక్కడి భౌగోళిక పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి ప్రయోజనాలు కూడా ప్రాజెక్ట్ ప్రోజెక్టుకూ మారిపోతుంటాయి. అయినా.. సాగర్ తో సరిపోల్చి చూసినప్పుడే పోలవరం ప్రాజెక్ట్ గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది.

పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిపై రాజమండ్రి కి ఎగువభాగాన నిర్మిస్తున్న సంగతి అందరికి తెలుసు. కృష్ణ నదిపై సాగర్ ఏ విధంగా టెర్మినల్ రిజర్వాయరు అవుతుందో.. గోదావరి పై పోలవరాన్ని కూడా అదేవిధముగా పరిగణిస్తున్నారు.

అయితే సాగర్ ను నది మధ్య భాగంలో స్పిల్వే వుండే విధంగా నిర్మించారు. కానీ పోలవరానికి వచ్చేసరికి స్పిల్వే ను నదికి సంబంధం లేకుండా పూర్తిగా కుడివైపున నిర్మించారు. ఇందుకోసం నది ప్రవాహాన్ని 6 కిలోమీటర్ల మేర కుడివైపునకు మళ్లించే విధంగా కిలోమీటరుకు పైగా వెడల్పున తవ్వేశారు. ఇందుకోసం 6 కోట్ల ఘణపుమీటర్లకు పైగా మట్టిని వెలికి తీశారంటే నది ప్రవాహం మల్లింపు ఎంత పెద్దదో అర్ధం చేసుకోవచ్చు. ఈ మళ్లించిన గోదావరిలో 50 లక్షల క్యూసెక్కుల వరద సైతం ప్రవహిస్తుంది. ఇందుకోసం నిర్మించిన కాంక్రీటు స్పిల్వే 1128 మీటర్లు.. అంటే కిలోమీటరు కన్నా పెద్దది. అటువంటి స్పిల్వే నే సాగర్లో 471 మీటర్లు ఉంది. అంటే పోలవరం స్పిల్వే లో ఇది మూడోవంతు.

ఇక ఇక్కడ ఎర్త్ కం రాక్ ఫిల్ డాం నది గర్భంలో నిర్మించనున్నారు. దీని పొడవు రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది. సాగర్ లో మాత్రం ఇంతకన్నా పెద్దదే అయినా ఒకటిగా కాకుండా జలాశయానికి రెండు వైపులా ఉంటుంది. అందువల్ల నది మధ్యలో ఎర్త్ కం రాక్ ఫిల్ డాం రావటం అనేది ప్రపంచం లో అరుదైనది. అది పోలవరంలోనే చేపడుతున్నారు.

సాగర్ తో పోల్చి చుస్తే ఈ ప్రాజెక్ట్ ఎత్తు మాత్రం తక్కువే. ఇక్కడ 40 మీటర్ల ఎత్తులో జలాశయం నిర్మించారు. ఫలితంగా నీటి నిల్వ 194 టీఎంసీలు ఉంటుంది. సాగర్ కి వచ్చేసరికి మాత్రం ఇక్కడి కన్నా 115 టీఎంసీలు ఎక్కువ. అయితే పోలవరంలో నీటి విస్తరణ ప్రాంతం చాల ఎక్కువ. 600 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో నీరు ఉంటుంది. అంటే 2 లక్షల 20 వేల ఎకరాలు ముంపునకు గురి కానుంది. గరిష్ట నీటి మట్టం 32 మీటర్లు. సాగర్ కు వచ్చేసరికి 125 మీటర్లు ఎత్తు వరకు నీరు నిల్వ ఉంటుంది.

సాగర్ కు నీరు లభించే ప్రాంతం 2 లక్షల 15 వేల చదరపు కిలోమీటర్లు కాగా పోలవరానికి వచ్చేసరికి 3 లక్షల 10 వేల చదరపు కిలోమీటర్లు. అయితె ఆ ప్రాజెక్ట్ లో గరిష్టంగా 18 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండగా.. పోలవరం లో మాత్రం 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన కిందకు వెళ్లిపోయే విధంగా ఇక్కడ స్పిల్వే నిర్మించారు. సాగర్ లో వరద నియంత్రణ ప్రధానమైన అంశం కాదు. కానీ, ఇక్కడ మాత్రం వరద నియంత్రణ తో పాటు 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, కృష్ణ నదికి నీటిని మళ్లించటం ఒక ప్రత్యేకత. మొత్తం మీద సాగర్ దేశంలోనే రెండవ అతిపెద్దది కాగా.. పోలవరం అతిపెద్ద స్పిల్వే తో ప్రపంచం లోనే నెంబర్ వన్ కానుంది.

Комментарии

Информация по комментариям в разработке