అఫ్గాన్‌లో మహిళలను రాళ్లతో కట్టి చంపే శిక్ష అమలు | Afghan Women Will be Stoned to Death for Adultery

Описание к видео అఫ్గాన్‌లో మహిళలను రాళ్లతో కట్టి చంపే శిక్ష అమలు | Afghan Women Will be Stoned to Death for Adultery

అఫ్గానిస్థాన్ లో రాతియుగం నాటి అమానవీయ శిక్షలను తాలిబన్లు మళ్లీ అమలు చేస్తున్నారు. వ్యభిచారానికి పాల్పడిన మహిళలను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేసే శిక్షను పునరుద్ధరించనున్నట్లు స్పష్టంచేశారు. తాలిబన్ సుప్రీం లీడర్ ముల్లా హిబతుల్లా అఖుండ్ జాదా విడుదల చేసిన వీడియో సందేశాన్ని దేశ అధికారిక టివి ఛానెల్ ప్రసారం చేసింది. అంతర్జాతీయ సమాజం చెబుతున్న మహిళా హక్కులు అనేవి, ఇస్లాం షరియా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని హిబతుల్లా వెల్లడించారు.

మహిళలను చనిపోయేదాక రాళ్లతో కొట్టడం.. వారి హక్కులకు విఘాతమని అందరూ చెబుతారనీ అయితే వ్యభిచారం చేసిన మహిళలకు త్వరలోనే ఆ దండన అమలు చేస్తామని తేల్చిచెప్పారు. అది కూడా బహిరంగంగా ముందుగా కొరఢాలతో.. ఆ తర్వాత రాళ్లతో కొట్టిచంపుతామన్నారు.
అఫ్గాన్ ను ఆధీనంలోకి తీసుకోగానే తమ బాధ్యత తీరిపోలేదన్న ఆయన.. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు.

2021 ఆగస్టులో అమెరికా బలగాల నిష్క్రమణతో అఫ్గాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టారు. వెంటనే.. బాలికలను, మహిళలను విద్య, ఉద్యోగాలకు దూరం చేశారు. మహిళలు హిజాబ్ ధరించాలని ఆంక్షలు విధించారు.
తీవ్రమైన ఆంక్షల కారణంగా గత మూడేళ్లలో అఫ్గాన్ లో మానసిక కుంగుబాటు పెరిగిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. ఫలితంగా బాలికలు, మహిళల ఆత్మహత్యల రేటు కూడా పెరిగిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке