చైనాలో 20 సైబీరియన్ పులులు మృతి | Deaths of 20 Siberian Tigers At East China Zoo Being Investigated

Описание к видео చైనాలో 20 సైబీరియన్ పులులు మృతి | Deaths of 20 Siberian Tigers At East China Zoo Being Investigated

తూర్పు చైనా ఎన్ వే ప్రావిన్స్ లోని ఓ వన్యప్రాణుల ఉద్యానవనంలో 20-సైబీరియన్ పులులతో సహా పలుజంతువులు అసాధారణరీతిలో మృత్యువాత పడటంతో ఆ పార్కు కార్యకలాపాలను అధికారులు నిలిపివేశారు. ఫుయాంగ్ ప్రాంతంలో జరుగుతున్న ఈ మరణాలపై విచారణకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వన్యప్రాణుల పార్క్ లో చట్టవిరుద్ధంగా....ఫస్ట్ క్లాస్ ప్రొటెక్షన్ జాబితాలోని సైబీరియన్ జాతి పులులను ప్రదర్శిస్తూ....వాటి పెంపకం చేపట్టినట్లు ఒక చైనా మ్యాగజైన్ ప్రచురించింది. జంతుప్రదర్శనశాల నిర్వహణ హక్కులపై నెలకొన్న వివాదాల కారణంగా భారీ సంఖ్యలో వన్యప్రాణులను మృత్యువు కబళించినట్లు నివేదిక తెలిపింది. వాటిలో 20 పులులు, రెండు ఆఫ్రికా సింహాలు, మూడు జిరాఫీలతోపాటు అరుదైన మూడు జంతువులు మరణించినట్లు పేర్కొంది. 2019లో ఫ్యుయాంగ్ వన్యప్రాణుల పార్కులో ప్రదర్శన కోసం 25 సైబీరియన్ పులులను లీజుకు తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. వాటిలో 2019-2023 మధ్య కాలంలో మొత్తం 6 పులులు మరణించినట్లు పేర్కొంది. ఆ సమయంలో పార్క్ లో 11 పులి పిల్లలు ఉండగా ప్రస్తుతం వాటిలో ఒకటి మాత్రమే మనుగడలో ఉన్నట్లు...పార్కు యాజమాన్యం...అధికారులకు తెలిపింది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке