భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం | YS Bharathi Election Campaign In Pulivendula

Описание к видео భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం | YS Bharathi Election Campaign In Pulivendula

ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆయన సతీమణి భారతికి చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో సొంతపార్టీ నేతలే ఆమెను నిలదీశారు. తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాసుపుస్తకాలపై సీఎం జగన్ ఫొటో ఎందుకు ముద్రిస్తున్నారని ప్రశ్నించడంతో ఆమె అవాక్కయ్యారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో భారతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా …కుమ్మరాంపల్లె మాజీ సర్పంచి భర్త, వైకాపా నాయకుడు భాస్కరరెడ్డి ఆమెకు విజ్ఞప్తి చేస్తూనే ప్రశ్నల వర్షం కురిపించారు. పట్టాదారు పాసుపుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని.. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. సీఎం జగన్ ప్రతి సమావేశంలోనూ నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదని భారతి వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 16 వేలలో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదేనని.. దీని వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ మొత్తాన్ని పెంచి రైతులకు మేలు జరిగేలా చూడాలని కోరారు. భాస్కరరెడ్డి ప్రశ్నలకు భారతి సమాధానం చెప్పకుండా మౌనంగా విని వెళ్లిపోయారు..
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке